mt_logo

అమ్మహస్తం పథకం స్థానంలో మరో పథకం..

ప్రస్తుతం ఉన్న అమ్మహస్తం పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం రూ.185 కే తొమ్మిది వస్తువులు అంటూ ప్రవేశపెట్టిన ఈ పథకానికి పేదలనుండి వ్యతిరేకత వచ్చింది. సరుకుల్లో నాణ్యత లేకపోవడం, పురుగులున్న పిండి, చింతపండు, పసుపు, మిర్చి వంటి వస్తువులకు డిమాండ్ లేకపోవడంతో మొదటినుండి ఈ పథకానికి సరైన ఆదరణ లభించలేదు. పామాయిల్ పట్ల ప్రజలు ఆసక్తి కనపరిచినా కేంద్రం నుండి దాని సరఫరా లేకపోవడంతో ఈ పథకాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *