ప్రముఖ ఇంటర్నేషన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్‌లో ఇవాళ ప్రారంభమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీజియన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ ఆసియా ఫసిఫిక్ రీజియన్ ప్రకటించింది. ఈ కొత్త సెంటర్ 2030 నాటికి సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబడుటు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో సంవత్సరానికి సగటును 48 వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రారంభించిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ భవిష్యత్‌లో రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతామని చెప్పిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్ దేశంలో ప్రగతిశీల డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
