తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మరో శుభవార్త తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మరిన్ని గురుకుల జూనియర్ కాలేజీలో అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న 119 బీసీ గురుకుల పాఠశాలలను బీసీ జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయనుంది. ఇకపై ఈ పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవలం 21 గురుకుల విద్యాసంస్థలు మాత్రమే ఉండేవి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున రెండు విడతల్లో 238 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది.
