హైదరాబాద్‌లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టామని, భవిష్యత్‌లో హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అవతరించాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, దానికనుగుణంగా ఆలోచనతో, ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. టీడీఆర్ తో జీహెచ్ఎంసీకి రూ.3 వేల కోట్లు ఆదా చేయడం జరిగిందన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ.1946.90 కోట్లతో ఇరవై రెండు పనులు పూర్తి చేశామన్నారు. రూ.5,693.51 కోట్ల వ్యయంతో మరో ఇరవై నాలుగు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా కేబుల్ బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్, అండర్ పాస్‌లు నిర్మించామన్నారు. ఇందిరా పార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సౌత్ జోన్‌లో ఓవైసీ ఫ్లై ఓవర్‌ను 93.6 కోట్లతో, బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌ను 106 కోట్లతో, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను 41.55 కోట్లతో, నల్లగొండ క్రాస్ రోడ్డు టు ఓవైసీ జంక్షన్ 523 కోట్లతో, ఫలక్‌నూమా ఆర్వోబీ రూ.52 కోట్లతో, శాస్త్రిపురం ఆర్వోబీ రూ. 91 కోట్లు, ఆరాంఘర్ టు జూపార్క్ ఫ్లై ఓవర్ రూ. 636 కోట్లతో వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ శాసనసభకు తెలిపారు.
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- Congress targets KTR with baseless slander and orchestrated misinformation campaigns
- KTR slams Rahul Gandhi for double standards on Adani issue
- Demolitions, DPR discrepancies, varying costs: Musi beautification project mired in controversy
- Kavitha exposes Congress party’s deceit on Musi beautification project
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
- అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం: కేటీఆర్
- ఫార్ములా-ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము రేవంత్‌కు లేదు: కేటీఆర్
- భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్
- స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
- ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు