హైదరాబాద్‌లోని ఓల్డ్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మురికివాడల అభివృద్ధి సవాల్‌తో కూడుకున్న అంశమని, సవాళ్లను అధిగమించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని స్పష్టం చేశారు. డిగ్నిటీ హౌసింగ్ కార్యక్రమం కింద డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి.. నిరుపేదలకు ఆ ఇండ్లను అందజేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఓల్డ్ మారేడ్‌పల్లిలో 468 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.