mt_logo

ఘనంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్న సిటీ కాలేజ్

వందేండ్లకు పైగా విద్యనందిస్తూ ఎందరికో దిక్సూచిగా నిలించిన సిటీ కళాశాల.. ఘనమైన చరిత్రతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు శత వసంతాల వేడుకలను నిర్వహించుకునేందుకు ముస్తాబవుతుంది. 1921లో అప్పటి 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల మీదుగా ఏర్పాటైన సిటీ కళాశాల ప్రస్థానం శతవసంతాలు పూర్తికావస్తున్నందున వందేండ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన సమవేశంలో సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలభాస్కర్‌ మాట్లాడుతూ.. వందేండ్ల చరిత్రలో గొప్పదైన తొలిదశ తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుండే పురుడు పోసుకున్న నేపథ్యం కలిగి ఉన్నది సిటీ కాలేజ్. ఎంతోమంది ఉన్నత విద్యార్థులను తీర్చిదిద్దింది. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ నగరాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారు. పైగా ఇటీవల అటానమస్‌ కాలేజీగా గుర్తింపు సాధించింది. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన కాలేజీ శతవసంతాల ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలియజేసారు. ఈనెల 29వ తేదీన శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *