ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రేలాపణలకు కట్టా శేఖర్ రెడ్డి చురకలు:
—
– “పార్టీలు, నాయకులు నిర్ణయం తీసుకోలేరు”
తమరిని ఏ ప్రజలు ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి అయ్యారు? తమరిని కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ నిర్ణయించి ముఖ్యమంత్రిని చేశారా లేక ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రి అయ్యారా?
—
– “ప్రజలకు నచ్చకపోతే సెలవులు ప్రకటించడం ఖాయం”
తమరికి ఆ రాత ముందే రాసిపెట్టి ఉంది. తెలంగాణ ఇచ్చినా సమైక్యాంధ్ర కొనసాగించినా తమరు ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఉద్ధరించేదేమీ లేదని అధిష్ఠానానికీ తెలుసు. ఆడలేక మద్దెలపై నెపం ఎందుకు? సమస్యను ఎదుర్కోలేక పార్టీకి, నాయకత్వానికి శాపాలు ఎందుకు? ఇవి అక్కసు, ఆగ్రహమూ, భయమూ కలగలిసిన ఉకృష్టపు మాటలు.