mt_logo

హైదరాబాద్ మాదిరా! తెలంగాణ ఆత్మరా!!

 

సీమాంధ్రలోనైనా, తెలంగాణలోనైనా దేశంలో ఏ ప్రాంతంలోనైనా పాలక వర్గాలు ప్రజా వ్యతిరేకులే. దీనిని గుర్తించి హైదరాబాద్ నగరంలోని సీమాంధ్ర మధ్యతరగతి, ఉద్యోగ వర్గం మసులుకోవాలి. సీమాంధ్ర భూస్వామ్య పాలకవర్గం హైదరాబాద్‌లో తమ ఆస్తులను, ఖబ్జా చేసిన వేలాది ఎకరాల భూమిని రక్షించుకోవడానికే ‘హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం’ అనే వాదనను ముందుకు తెస్తున్నారు. వారికి వంతపాడటం ఎంతవరకు భావ్యమో హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర మధ్యతరగతి, ఉద్యోగులు ఆలోచించాలి. ఏమైనా 15 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ కవులు, కళాకారులుగా మేం ‘హైదరాబా ద్ తెలంగాణ ఆత్మ అని, దానిని ఎవరూ విడదీయలేర’ని భావిస్తున్నాం. హైదరాబాద్ మహా పట్నాన్ని రక్షించుకోవడానికి తెలంగాణకు ఈ పట్నానికి శతాబ్దాల తరబడి ఉన్న సాంస్కృతిక, సాంఘిక, సాహిత్య అనుబంధాన్ని చాటిచెబుతూ ఉద్యమించాలని స్థానిక తెలుగు, ఉర్దూ కవులుగా గొంతెత్తుతున్నాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాదని చాటి చెప్పడానికి కవి గాయక సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ బిడ్డలుగా ఉర్దూ, తెలుగు కవులు, వాగ్గేయకారులందరూ ఇందులో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం.

 

ప్రారంభ సభ
– ——- –
ఆహ్వానం: డాక్టర్ పసునూరి రవీందర్ (సింగిడి తెరసం)
అధ్యక్షత: స్కైబాబ (తెలంగాణ ముస్లిం రచయితల వేదిక)
అతిథులు: ప్రొఫెసర్ కోదండరాం (తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్)
జూకంటి జగన్నాథం (తెలంగాణ రచయితల వేదిక)
జహీర్ అలీఖాన్, జమీలా నిషాత్
డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
డాక్టర్ అందెశ్రీ, గోరటి వెంకన్న, సంగిశెట్టి శ్రీనివాస్

ప్రత్యేక ఆహ్వానితులు:

ఎంటీ ఖాన్, కేశవరావు జాదవ్, బూర్గుల నర్సింగరావు, డాక్టర్ అంబటి సురేందర్రాజు, బి.నర్సింగరావు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, సీహెచ్ మధు, గుడిపాటి
సమన్వయకర్త: ఎస్. జగన్‌రెడ్డి

వివిధ సెషన్‌లకు అధ్యక్షత:

డాక్టర్ ఖుతుబ్ సర్‌షార్, అమ్మంగి వేణుగోపాల్, కాసుల ప్రతాప్‌రెడ్డి, జూపాక సుభద్ర, కొల్లాపురం విమల, సూరేపల్లి సుజాత, వేముగంటి మురళి, ఏనుగు నర్సింహ్మాడ్డి, అనిశెట్టి రజిత, అన్నవరం దేవేందర్… తదితరులు.

తెలంగాణ బిడ్డలైన ప్రతి ఒక కవికీ వాగ్గేయకారుడికీ ఇదే మా పిలుపు.

(‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సాహిత్య సమాఖ్య, ‘జులూస్ కవులు, తెలంగాణ ముస్లిం రచయితల వేదిక, ఉర్దూ తెలుగు లిటరరీ ఫోరమ్, ‘హలఫ్’ లిటరరీ ఫోరమ్, ‘షాహీన్’, ‘జయమిత్ర’ సాహిత్య సాంస్కృతిక వేదిక, హైదరాబాద్ కవుల వేదిక, ‘మట్టిపూలు’ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రచయిత్రుల వేదిక, మంజీరా రచయితల సంఘం, వెన్నెల అకాడమీ, మహెఫిల్-ఎ-ఖవాయితెఁ, పాతనగరం రచయితల సంఘం, ‘ముక్త’ తెలంగాణ మహిళల అధ్యయన వేదిక, జిందా దలాన్, జనగామ రచయితల సంఘం, కళా భారతి, హరిదా రచయితల సంఘం, యువ కళా సమితి, మిత్ర మండలి, రుద్రమ ప్రచురణలు, యువ సాహితీ సమితి, గోదావరి సాహితీ మిత్రులు, తెలుగు సాహితీ సదస్సు, ఉర్దూ అదబ్, సృజనలోకం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *