జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను పరిశీలించిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సుబ్రతో గుప్తా.
దేశంలోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం గొప్ప విషయం. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఈ క్యాపింగ్ పనులు చరిత్రాత్మకంగా నిలుస్తుందని గుప్తా అన్నారు.
ఈ క్యాపింగ్ పనులలో చేపట్టిన శాస్త్రీయ విధానాలను పరిగణలోకి తీసుకుని తమ రాష్ట్రంలోనూ డంపింగ్ యార్డ్ ల క్యాపింగ్ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సుబ్రతో గుప్తా అన్నారు.