mt_logo

ప్రజలంతా తప్పక మాస్క్ ధరించండి : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేటలో 15 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టీకాలు రెండో డోస్ కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలలో మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గర్భిణులు కరోనా టీకాలు తీసుకోవద్దనే అపోహలు వద్దన్నారు. మీరు కోరితే మీ ఇంటింటికి వచ్చి కరోనా టీకాలు వేయిస్తామని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *