• వాటర్ గ్రిడ్ కోసం చేపట్టిన మెదటి పర్యటనలో మంత్రి
• కల్వకుర్తి ఎత్తిపోతల పంపింగ్ హౌస్, ఏల్లూర్ బాలన్సింగ్ రిజర్వాయర్ పరిశీలన
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసాన్ని చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా వాటర్ గ్రిడ్ ని చేపట్టారని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వాటర్ గ్రిడ్ కోసం చేపట్టిన వరుస పర్యటనల్లో భాగంగా చేపట్టిన మెదటి పర్యటనలో మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఏల్లూర్ బాలన్సింగ్ రిజర్వయర్ ని సందర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పంపింగ్ హౌస్ లోపలకి దిగి అక్కడి పనులను, ఇంజనీరింగ్ డిజైన్ లను పరిశీలించారు. కృష్టా నది నుంచి పంపింగ్ హౌస్ దాకా తవ్విన కెనాల్ (సర్జ్ పూల్) అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం జరిగిన తీరుని అక్కడి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నదితీరం నుంచి వస్తున్న పంపింగ్ హౌస్ దాక నీరు వస్తున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. మంత్రులు జూపల్లి కృష్టారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ సెకరటతీ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వెంట పర్యటనలో ఉన్నారు.
ఏల్లూర్ వద్ద నిర్మించబోయే ఇంటెక్ వెల్ నిర్మాణానికి 3 సంవత్సరాలకి పైగా సమయం పడుతుందని, ఆ లోగా సాగునీటి శాఖ సహయంతో వాటర్ గ్రిడ్ కి నీరు అందిస్తామని తెలిపారు. ఏల్లూరు ఇంటెక్ వెల్ నుంచి 13 టియంసిల నీటిని 365 రోజుల పాటు వాటర్ గ్రిడ్ కి వాడుకుంటామని తెలిపారు. ఈ ఇంటెక్ వెల్ నుంచి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల వాటర్ గ్రిడ్ కి నీళ్లు అందిస్తామన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో 10శాతం తాగునీటి అవసరాలకి కేటాయించించి ఉన్నాయని, ఇది గత ప్రభుత్వాల కాలం నుంచి అమలులో ఉన్న నిర్ణయమే అని అయన గుర్తు చేశారు. ప్రజల తాగునీటి అవసరాలు కనీస హక్కుగా భావిస్తూ, తాము చేపట్టిన ఈ వాటర్ గ్రిడ్ విజయవంతం అవుతుందని అయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రకృత్తితో అనుసంధానంగా ఉండాలని (consonance with nature) ముఖ్యమంత్రి అలోచనల మేరకు, ఈ ప్రాజెక్టు ద్వారా తాము గ్రావీటీ ద్వారా మరియు కొంత పంపింగ్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఖచ్చితంగా మూడున్నరేళ్లలో ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తమన్న నమ్మకం వ్యక్తంచేశారు. ఇప్పటికే వాటర్ గ్రిడ్ కి సాగునీటి శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయని తెలిపారు. వాటర్ గ్రిడ్ ని ప్రజల మద్దతుతో కలసి విజయవంతం చేస్తామని మంత్రి తెలిపారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటన నుంచి వచ్చినా తర్వాత కొల్లాపూర్ లోని అర్ ఆండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర జిల్లా అధికారులతో కలసి వాటర్ గ్రిడ్, పించన్లు, పంచాయితీరాజ్ శాఖ మీద సమీక్ష నిర్వహించారు. మంత్రి పర్యటనలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.