mt_logo

తెలంగాణ కొరకు పాలమూరుకు పబ్బతి పడదాం!

నిత్యం కొత్త కొత్త ఉద్యమరూపాలను ఆవిష్కరిస్తూ చక్కని కార్యాచరణతో ముందుకు వెళ్తున్న తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు మరో దీక్షకు శ్రీకారం చుట్టాడు.

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం నాడు “పాలమూరు పబ్బతి” పేరుతో మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాల సరిహద్దు గ్రామం మన్ననూర్ వద్ద రెండు రోజుల దీక్షకు కూర్చుంటున్నాడు వేనేపల్లి.

“మన్ననూర్ లో ఆరు పూటలు ఉందాం. నల్లమలకు నమస్కరిద్దాం, పాలమూరుకు పబ్బతి పడదాం. ఆంధ్ర ప్రదేశ్ నుంఛి విడిపోదాం. మళ్లీ మన పాత తెలంగాణ తెచ్చుకుందాం. సీమాంధ్ర పాలకులను తరిమేద్దాం. మనల్ని మనమే పరిపాలించుకుందాం” అనే సందేశంతో ఈ దీక్షను చేపడుతున్నాడు వేనేపల్లి పాండురంగారావు.

నూతన సంవత్సరంలో వేనేపల్లి దీక్షల పరంపర:

– డిసెంబర్ 31- జనవరి 1 నాడు ‘2011 పోతుంది. 2012 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోవాలి. తెలంగాణ రాష్ట్రం రావాలి’ అనే నినాదంతో  కొండ్రపోలులో 48 గంటల దీక్ష.

– జనవరి 17 నాడు సంక్రాంతి పండుగకు సీమాంధ్రకు వెళ్లి తిరిగివచ్చే వారికి తెలంగాణ గురించి అవగాహన కల్పించేందుకు NH-9 రహదారిపై ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు గ్రామం నల్లబండగూడెం వద్ద 24 గంటల నిరసన దీక్ష

– జనవరి 30 నాడు హైదరాబాదుకు కృష్ణా జలాలు అందించే కోదండాపురం నీటిశుద్ది కేంద్రం వద్ద 24 గంటల దీక్ష

తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు గురించి ఇక్కడ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *