ఇట్లాంటివి చూసినప్పుడే కొందరు తెలంగాణ ప్రజలకు ఈ సంఘటనపై వచ్చిన అనుమానాలు నిజమనిపిస్తాయి.
ఈ దుస్సంఘటన జరగగానే తమ ఆందోళనలు కూడా వాయిదా వేసుకుని,
బాధితుల కొరకు రక్తదాన శిబిరాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమ నాయకత్వం గొప్ప పరిణతి చూపిస్తే,
దిల్ సుఖ్ నగర్ రోడ్డు మీద రక్తపు మరకలు ఆరకముందే,
సంఘటన జరిగింది సమైక్య రాష్ట్రంలోనే అన్న ప్రాధమిక విషయం మరచి,
తెలంగాణ-వ్యతిరేక నాయకత్వం ప్రేలాపనలు చూడండి.
(ఈనాడు వార్తా కథనం)