mt_logo

కొత్తగూడెం యువకులపై బెజవాడలో దాడి

– చంపేస్తామని.. ప్రాంతం పేరుతో దూషిస్తూ దాడి చేసిన టాక్సీ డ్రైవర్లు

– కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..పక్షపాతం ప్రదర్శించిన పోలీసులు

కొత్తగూడెం క్రైం/విజయవాడ, టీ మీడియాప్రతినిధి: తెలంగాణ యువకులపై మరో సారి ఆంధ్రాలో దాడి జరిగింది. తెలంగాణ వాస్తవ్యులని గుర్తించి మరీ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం..కొత్తగూడెంకు చెందిన వల్లాల భరత్ ఇటీవలె కారు కొనుగోలు చేశాడు. మరమ్మతుల కోసం స్నేహితుడు భరత్ అగర్వాల్, కారు డ్రైవర్‌తో శుక్రవారం విజయవాడకు వెళ్లారు. మరమ్మతులు పూర్తయ్యాక రాత్రి వేళ తిరుగుప్రయాణమయ్యారు. తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బస్టాండు సమీపంలోని కారు ట్యాక్సీస్టాండ్ సమీపంలో ఆగారు. గమనించిన స్థానిక కారు ట్యాక్సీడ్రైవర్లు పరుగు పరుగున వచ్చారు.

కారుపై ఉన్న ఖమ్మం రిజిస్ట్రేషన్ (ఏపీ 20)ని చూసి, ‘మీరు ఎక్కడి నుంచి వచ్చార్రా’ అని భరత్ ప్రశ్నించారు. ‘మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం’ అని భరత్ బృందం సమాధనమిచ్చింది. దీంతో అక్కడి డ్రైవర్లు ఆగ్రహం తో.. ‘మీ ప్రాంతం వారికి ఎందుకురా అంత బలుపు’ అంటూ అసభ్యంగా దూషిం చారు. దీంతో భరత్ బృందం ఎదురు ప్రశ్నించడంతో అక్కడి డ్రైవర్లు పిడి గుద్దుల వర్షం కురిపించి తీవ్రంగా గాయపరిచారు. వారి బారి నుంచి తప్పించుకుని భరత్ బృందం కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. లిఖితపూర్వక ఫిర్యాదు చేసి నా రశీదు ఇవ్వలేదు. గొడవెందుకు..ట్యాక్సీ డ్రైవర్లతో సంధి కుదుర్చుకోండి అన్నట్లుగా సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు. కచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందేనని పట్టు బట్టడంతో పోలీలసులు దిగొచ్చారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ కే గోవిందరాజు శనివారం తెలిపారు. మరికొందరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *