mt_logo

తెలంగాణ స్టార్టప్ లకు వేదిక : కేంద్ర మంత్రి జితేంద్రసింగ్

ఐటీ రంగంలో ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు చేయాలని, ఇందుకు సంబంధించిన కసరత్తు జరగాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. నేడు హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ… ఐటీ రంగంలో తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టార్టప్ లకు వేదికగా మారిందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన రీతిలో డిజిటల్ టెక్నాలజీలో పోటీ ఉండాలన్నారు. ప్రధాని మోదీ డిజిటల్ టెక్నాలజీ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ మోడ్ లో డిజిటల్ రంగం విస్తరించింది. పేపర్ లెస్, క్యాష్ లెస్ ట్రాన్సెక్షన్ లకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. తెలంగాణలో స్పేస్ రంగానికి సంబంధించి మంత్రి కేటీఆర్ అడిగిన దానికి సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం ప్రభుత్వం మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *