mt_logo

సీఎం కేసీఆర్ మానవీయపాలనకు ఇది నిదర్శనం : మంత్రి కేటీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో ఇబ్బందులు పడ్డ ఆశావర్కర్లు, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ కార్మికులకు మరే రాష్ట్రంలో లేనట్టుగా మూడు సార్లు జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు ఇది నిదర్శనం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆశావర్కర్లకు గౌరవ వేతనంగా 1800 మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు అది అంచెలంచెలుగా పెంచి 9,750 ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రతిరోజూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులకు, ఆశాకార్యకర్తలకు ఇది సముచిత గౌరవమన్న కేటీఆర్, అన్నివర్గాల సంక్షేమం పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిబద్ధతకు ఇది రుజువన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు తార్కాణం… 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లు, 7,731 మంది పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులకు ఇది సముచిత గౌరవం!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *