తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించబోతున్న ‘అంతర్జాతీయ విత్తన సదస్సు’కు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సదస్సులో ‘ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా: తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ గ్లోబల్ సీడ్ హబ్’ అన్న అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎఫ్ఏవో ఆహ్వానించడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తనరంగానికి విశిష్ఠ గౌరవం లభించినట్టయింది. అంతేకాకుండా దేశంలో ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు హాజరుకానున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తిలో తెలంగాణ అభివృద్ధిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎలా ఎదిగిందన్న అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ఏకకాలంలో అంతర్జాతీయ భాషలైన ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ప్రసారం కానున్నది. తెలంగాణ రాష్ట్రానికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన ఎండీ కేశవులును అభినందించారు.
- CWC rejects DPRs of 3 irrigation projects due to Congress government’s apathy
- Congress targets KTR with baseless slander and orchestrated misinformation campaigns
- KTR slams Rahul Gandhi for double standards on Adani issue
- Demolitions, DPR discrepancies, varying costs: Musi beautification project mired in controversy
- Kavitha exposes Congress party’s deceit on Musi beautification project
- భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది: కవిత
- రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్
- ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్లో కావాల్సినంత సరుకు లేదు.. కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులతో ఫార్ములా-ఈ కేస్ డొల్లతనం తేటతెల్లమైంది: హరీష్ రావు
- ఫార్ములా-ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. న్యాయపరంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
- అక్రమ కేసులకు, అణిచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం: కేటీఆర్
- ఫార్ములా-ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము రేవంత్‌కు లేదు: కేటీఆర్
- భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్
- స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం
- ఆదానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడు: హరీష్ రావు