బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు.
ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని దీని వలన వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయన్నారు. వ్యవసాయ రంగాలనిక అనుకూలంగా ఉంటుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయన్నారు.
ఈ సంవత్సరం ధరలు అధికమవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల్లో పాలకపక్షంగా ఉన్నవారికి కొంత కష్టసాధ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నిస్తే దిగ్విజయ ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పారు.
కేసీఆర్ రాశి కర్కాటక రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా ఉందని.. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడని.. ఈ సంవ్సతరమంతా వీరికి బాగుంటుందని తెలిపారు. కేసీఆర్ చేసే వ్యవహరాల్లో మంచి విజయం చేకూరే అవకాశాలున్నాయని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. కేసీఆర్ మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని అన్నారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ది మకర రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజ్యపూజ్యం 3, అవమానం 1 గా ఉందని పండితులు తెలిపారు. ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు. ఈ రాశి వాళ్లు ప్రజలు, పార్టీలో అందరి అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందన్నారు.
ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కేటీఆర్ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. పండుగపూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి. మతకల్లోలాలు లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి. వ్యవసాయం బాగుండాలి. వాతావరణ అనుకూల పరిస్థితులు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- Congress govt. to use satellite survey to disburse Rythu Bharosa only for cultivated lands?
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్