mt_logo

హైదరాబాద్ కు కొత్త శోభ… మార్చిలో ప్రారంభం కానున్న మరో రెండు ఫ్లైఓవర్లు

హైదరాబాద్‌ నగరానికి మరో నాలుగు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటుకు స్కై వేలు, మేజర్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు ఆర్ఓబీలు, అండర్ పాసెస్ నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ వ్యవస్థ మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ రహిత నగరంగా రూపొందించేందుకు ఎస్ఆర్‌డీపీ పనులు దోహద పడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. మార్చి నెలలో ఎస్ఆర్‌డీపీ కింద చేపట్టిన రెండు అండర్ పాసులు మరో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. అందులో తుకారాం రైల్వే అండర్ పాస్, ఎల్బినగర్ ఆర్‌హెచ్ఎస్‌ అండర్ పాస్‌లు బహదూర్ పుర, భైరమాల్ గూడ ఆర్‌హెచ్ఎస్‌ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే బహద్దూర్ పుర నుండి ఉప్పల్ వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా సురక్షిత ప్రయాణంతో నిర్దేశిత గడువులోగా గమ్యానికి చేరే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కాలుష్యం తగ్గడంతో పాటుగా వాహన ఇంధన పొదుపునకు ఎంతగానో దోహదపడతుంది. ఫ్లై ఓవర్ 780 మీటర్ పొడవులో 400 మీటర్లు డక్ పోర్షన్ ఆర్ఈ వాల్ 12.50 మీటర్ల వెడల్పుతో నిర్మాణాలను చేపట్టారు. ఫ్లైఓవర్ పనులు ఫినిషింగ్ స్థాయిలో ఉన్నాయి. మార్చి మాసం మొదటి వారం వరకు పూర్తి చేసి రెండవ వారంలో అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *