mt_logo

కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రెండు లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద రూ.2 లక్షల చొప్పన, ఈనెల 15న చెక్కుల పంపిణీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్‌ 6 వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. కరోనాతో మరణించిన ముగ్గురు జర్నలిస్టుల కుటుంబాలకు ఈ ఏడాది మార్చిలో ఓసారి ఆర్థిక సహాయం అందించామని, ఈ కుటుంబాలకు ఇప్పుడు అదనంగా మరో రూ.లక్ష చొప్పున.. అనారో గ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున చెక్కులను అందిస్తామని వివరించారు. ఈ విధంగా మొత్తం 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1.62 కోట్లు పంపిణీ చేయడంతోపాటు ఆయా కుటుంబాలకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఐదేండ్లపాటు పెన్షన్‌ కూడా అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *