mt_logo

త్వరలో తెలంగాణ స్టడీ సర్కిల్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అఖిల భారత సర్వీసుల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందేలా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ లోని రోడ్ నం. 12 లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనాభా పది శాతం ఉంటుందని, అయితే అఖిల భారత సర్వీసుల్లో తెలుగువారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఇది చాలా ఆందోళన కల్గించే అంశమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున యువత సివిల్స్ వైపు దృష్టి పెట్టాలని, సివిల్స్ సాధనకు ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపక కార్యదర్శి కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి డైరెక్టర్ గా త్వరలోనే తెలంగాణ స్టడీ సర్కిల్ ను ప్రారంభిస్తామని చెప్పారు. సివిల్స్ తో పాటు గ్రూప్- 1, గ్రూప్- 2 తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని, దిగువ, మధ్యతరగతి విద్యార్థులకు కూడా ఫీజులు అందుబాటులో ఉండేలా శిక్షణ ఇస్తామని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. డైరెక్టర్ లింగాల పాండురంగారెడ్డి మాట్లాడుతూ, ఈ స్టడీ సర్కిల్ ను మరో రెండు, మూడు వారాల్లోప్రారంభిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *