పోలీసు శాఖలో త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర హోం శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు చర్యలు చేపట్టామని, కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గత 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేసిన పాపాలే తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయని, అధికారంలో ఉన్నన్నాళ్ళూ తెలంగాణ ప్రజల బాగోగులు మరిచిపోయిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు పదవులు కోల్పోగానే మతిస్థిమితం కోల్పోయిన వారిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చేసేది బస్సు యాత్రలా లేదని, విహార యాత్రలా ఉందన్నారు. తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని, తట్టెడు బొగ్గు లేని ఆంధ్రాలో థర్మల్ పవర్ ప్రాజెక్టులు మీ పాపం కాదా? అని ప్రశ్నించారు.