mt_logo

లండన్‌లో బతుకమ్మ – దసరా 2014 సంబురాలు

తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ – దసరా 2014 సంబురాలు జరిపారు.

వెస్ట్ లండన్‌లో ఐసిల్వర్త్ అండ్ సాయోన్ స్కూల్ (Isleworth & Syon School) ఆడిటోరియంలో జరిగిన ఈ సంబురాలకు యుకే నలుమూలలనుండి సుమారు 800లకు పైగా తెలంగాణ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

రంగురంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ప్రారంభించారు. విదేశాల్లో స్థిరపడ్డాకాని, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినీ ఆకట్టుకుంది.

బతుకమ్మలని నిమజ్జనం చేసి.. తదుపరి సాంప్రదాయబద్ధంగా సద్దుల ప్రసాదం ఇచ్చిపుచ్చుకున్నారు. స్వదేశంనుండి తెచ్చిన “జమ్మిచెట్టు”కు ప్రత్యేక పూజలు చేశారు. ప్రవాస తెలంగాణా సంస్థల చరిత్రలోనే ఇలా జమ్మిచెట్టు తెచ్చి పూజ చెయ్యడం మొదటిసారి అని తెలిపారు. హాజరైన తెలంగాణా బిడ్డలందరూ దీన్ని ప్రశంసించారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తల్పించిందని పలువురు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రెసిడెంట్ సభ్యులు సీకా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు గొప్ప విశిష్టత ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేసుకుంటున్న మొదటి బతుకమ్మ పండుగ కావున చాలా ఆనందంగా ఉంది మరియు ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం చాలా హర్షనీయం అని కొనియాడారు.

ఈ సందర్భముగా ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి ధన్యవాదాలు తెలిపినారు.

ఫౌండర్ మెంబర్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ సహకారంతో చేయడం చాలా గౌరవంగా ఉందని అన్నారు.

శ్రీ. కే.వీ. రమణాచారి పంపిన అభినందనలకు సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపినారు.

లండన్ M.P. వీరేంద్ర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన రాష్ట్రాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపి మన సంస్కృతిని భావితరాలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గురించి మరియు దీన్ని నిర్వహించడంలో TeNF చేస్తున్న కార్యక్రమాలు ఎంతో గర్వకారణం అని కొనియాడారు.

High Commission of India in London ప్రతినిధి ప్రీతం లాల్ ఈ సందర్బముగా మాట్లాడుతూ TeNF ఆవిర్భవించిన నాటినుంచి ఉన్న అనుబంధం గుర్తుకు చేసుకున్నారు. TeNF తెలంగాణా రాష్ట్ర సాధనలో చేసిన సహాయసహకారాలు మరియు ప్రవాస తెలంగాణా పౌరుల రాష్ట్ర సాధనలో ఒత్తిడి తేవడంలో TeNF పెద్ద పాత్ర పోషించారు అని అన్నారు.

ఇంకో ముఖ్య అతిథి గీత మోరల (మిల్టన్ కీన్స్ కౌన్సిలర్) మాట్లాడుతూ తెలంగాణా బిడ్డగా, ఇక్కడ ఒక ఆడకూతురుగా బ్రిటిష్ గవర్నమెంట్ లో Counsellor గా చేయడం చాలా గొప్ప అనుభూతి అని, ఇక్కడ ఉన్న తెలుగు తెలంగాణ బిడ్డలకు తను సహాయంగా ఎప్పుడూ ఉంటానని అన్నారు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒక్కదగ్గర కలుసుకొని పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

పిల్లలు మరియు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళచే ఏర్పాటుచేసిన తెలంగాణ జానపద నృత్యాలు అందరినీ అలరించాయి.

ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ప్రథమ- శుష్మన, ద్వితీయ- అర్చన మరియు తృతీయ- కవిత అవార్డు గెలుచుకున్నవారిలో ఉన్నారు.

TeNF కల్చరల్-ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి మరియు అడ్వైజర్ ఉదయ నాగరాజు ఆధ్వర్యంలో పవిత్ర రెడ్డి, సీకా చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు పవిత్ర రెడ్డి, అర్చన జువ్వాడి, మీనాక్షి, నిర్మల, జ్యోతి, స్వప్న షిండే, ప్రభలత, శ్రావణి బల్మురి, శ్వేతా రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గోలి తిరుపతి, అశోక్ గౌడ్, శ్రావణ్ రెడ్డి, రంగు వెంకట్, విక్రం రెడ్డి, హరి నవపేట్, మల్లారెడ్డి, జితేందర్, సుధాకర్ గౌడ్, వెంకట్ చందనాల,శివాజీ షిండే, శ్రీనాథ్ రెడ్డి, మధు రెడ్డి, గోలి సుమన్, శశిధర్, సందీప్, రత్నాకర్, విక్రం, మహేష్, సునీల్ మంద, విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీధర్ రావు, నరేష్, చిట్టి వంశీధర్ రెడ్డి తదితరులు, శ్రీను, వినోద్, సతీష్, పాల్గొన్నవారిలోఉన్నారు.

ఈ సందర్భముగా ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ uk ముఖ్యంగా లండన్ లో ప్రవాస భారతీయుల కోసం పనిచేసే అన్ని సంస్థలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరితో కలిసి ప్రవాస భారతయుల శ్రేయస్సు కోసం పనిచేసేలా మావంతు కృషి చేస్తామని చెప్పినారు. ఇక్కడకు విచ్చేసిన తాల్, యుక్తా, శిరిడి సాయి సంస్థ, వరల్డ్ తమిళ్ సంస్థ, తెదీఫ్, తెలుగు ఎన్ఆర్ఏయే ఫోరం, జెట్ సేవ్ ఉక్, హైదరాబాద్ ఫ్రండ్స్ సంస్థ (HYFY), ఎన్ఆర్ఐటీఆర్ఎస్ సెల్ (NRITRS)కు అభినందనలు తెలిపినారు.

మీ
సీకా చంద్ర శేఖర్
ప్రెసిడెంట్ -TeNF
0044781680370

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *