రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలీస్ ఈవెంట్స్ లో గర్భిణీలకు వెసులుబాటు కల్పించారు అధికారులు. రాష్ట్రంలో ఈనెల 8 నుండి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతుండగా… తమకు ఈవెంట్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని కొంతమంది గర్భిణీలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతులు పంపించారు. వీరి సమస్యను దృష్టిలో పెట్టుకొని గర్భిణీలకు ఓ వెసలుబాటు కల్పించింది రిక్రూట్మెంట్ బోర్డు. గర్భిణీలు ఈవెంట్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని, వారు నేరుగా మెయిన్స్ రాసుకోవచ్చని తెలిపింది. కాని వారు మెయిన్స్ పాస్ అయితే మాత్రం నెలరోజుల్లో ఈవెంట్స్ లో పాల్గొనాలని షరతు విధించింది. మరింత సమాచారం కోసం పాల్గొనాల్సిన పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు సంప్రదించాలని సూచించారు.
