తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 2,33,210 మంది పరీక్షకు హాజరు కాగా 1,68,692 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్, వొకేషనల్ కోర్సుల్లో కలిపి 72.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ సెకండియర్‌లో 2,19,271 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,65,060 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ వోకేషనల్ కోర్సుల్లో కలిపి 75.28 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

