mt_logo

సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టీహబ్ 2.0

నేడు హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేటివ్ టీహ‌బ్ 2.0 ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా దేశ‌విదేశాల ప్ర‌ముఖులు, పారిశ్రామిక‌ వేత్త‌లు సోషల్ మీడియా వేదిక‌గా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దేశ స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్‌కు టీ హ‌బ్ 2.0 గొప్ప వ‌ర‌మ‌ని కితాబిచ్చారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇన్నోవేష‌న్ క్యాంప‌స్ ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు, మంత్రి కేటీఆర్‌ కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి అభినంద‌న‌లు తెలిపారు.

రతన్ టాటా టీహబ్ 2.0 పై స్పందిస్తూ… “హైదరాబాద్‌లో కొత్త టీ-హబ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అభినందనలు తెలియజేశారు. భారత స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు ఇది గొప్ప ఊతమిస్తుందని ట్వీట్ చేశారు.”

సాప్ ల్యాబ్స్‌ ఇండియా ఎండీ, సింధు గంగాధరన్‌…“ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన కేటీఆర్‌కు అభినందనలని, టీహబ్‌ హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది అంటూ… ఆల్‌ ది వెరీ బెస్ట్‌ అని ట్వీట్ చేశారు.”

ఏపీ అండ్‌ టీఎస్‌ యూకే హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ప్లెమింగ్‌ ట్వీట్ చేస్తూ… హ్యాపనింగ్‌ హైదరాబాద్‌కు మరో మైలురాయి. ఏసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ తలుపులు తెరుచుకున్నాయని… టీహబ్ కేంద్రాలు అపురూపమైన స్పేస్‌, ఎనర్జీ, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌, ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అద్భుతమైన ప్రోత్సహాన్ని అందించనున్నాయన్నారు. టీహబ్‌ ఫేజ్‌-2కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.” ఎంపీ రంజిత్ రెడ్డి… “మంత్రి కేటీఆర్‌ ఆలోచన నుంచి పుట్టిన టీహబ్‌ కొత్త సౌకర్యం హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడానికి 8 సంవత్సరాలుగా ఎడతెరపిలేకుండా చేస్తున్న ప్రయత్నాల ప్రతిరూపం” అని ట్వీట్ చేశారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా అనేకమంది ఎంపీలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు … మంత్రి కేటీఆర్ కృషిని, టీహబ్ 2.0 సాధించబోయే విజయాలను కాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *