రోజురోజుకీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహన తయారీ పరిశ్రమను, వాహనదారులను ప్రోత్సహించేందుకు ” తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్” ఎనర్జీ స్టోరేజ్ 2020-2030 అనే ప్రత్యేక పాలసీని అమలు చేస్తోంది.
ఈ పాలసీలో ముఖ్యాంశాలు :
* మొదటి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, ముప్పైవేల ఆటో రిక్షాలు, ఐదువేల కార్లు, ఐదువందల ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ వందశాతం ఉచితం.
*విద్యుత్ ట్రాక్టర్లకు నిబంధనలకు లోబడి వందశాతం రోడ్డు టాక్స్ మినహాయింపు.
*వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక సహాయం.
*ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్ తో పాటూ ఇతర నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.
*జంట నగరాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున, జాతీయ రహదారులపై 25క్మ్ ఒకటి చొప్పున ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో మరియు టీఎస్పిడిసీఎల్ ఆధ్వర్యంలో ప్రణాళికలు.
*వెయ్యికి పైగా కుటుంబాలు కలిగిన టౌన్ షిప్స్ లో ఛార్జింగ్ స్టేషన్ లాట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం.
*విద్యుత్ వాహనాల తయారీ, సంబంధిత పరికరాలు ఉత్పత్తి చేసే కంపెనీలకు వివిధ ప్రోత్సాహకాలు.
*200 కోట్ల పెట్టుబడి వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ.
*ఐదేళ్ళపాటు 5కోట్ల ఎస్జీ ఎస్టీ రీయింబర్స్మెంట్ తో పాటు, ఐదేళ్ళపాటు 5 కోట్లకు మించకుండా 25శాతం విద్యుత్ రాయితీలు.
గతేడాది ఈ పాలసీ మొదలవగా.. ఏడాది కాలంలో 4,568 ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జరగగా, వినియోగదారులకు 20 కోట్ల ఆదా జరిగింది.