mt_logo

తెలంగాణలో క్షీర విప్లవం

పాడి పరిశ్రమ విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.246 కోట్లతో విజయ మెగా డెయిరీ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 35 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న మెగా డెయిరీకి భూమి పూజ చేయగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు విజయ డెయిరీ మూతపడే పరిస్థితి ఉండేనని, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పాడి రైతులకు వివిధ ప్రోత్సాహకాలు కల్పించడంతో 2014 వరకు రోజుకి లక్ష లీటర్ల పాల సేకరణ, 300కోట్ల టర్నోవర్ మాత్రమే కలిగివున్న విజయ డెయిరీ..ప్రస్తుతం ఏడాదికి 700కోట్ల టర్నోవర్ తో ప్రతిరోజూ నాలుగున్నర లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది అన్నరు. అలాగే 29 రకాల విజయ పాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తూ, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వీటికి డిమాండ్ ఉందని అన్నారు. ఇవ్వాలనిమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పాడి పంటలే రాష్ట్రానికి జీవనాధారం అని, పాడి రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని, పైలట్ పథకం కింద రంగారెడ్డి పాడి రైతులకు అధిక సంఖ్యలో పాడి గేదెలను ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు అధికారులు, పాడి సమాఖ్య డైరెక్టర్లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *