ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.89.04 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)కు రూ.51.74 కోట్లు, ఐటీ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి నిమిత్తం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ)కు రూ.37.30 కోట్లు కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఈ నిధులను ఖర్చు చేసేందుకు పరిపాలనా పరమైన అనుమతులు జారీచేస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం విడివిడిగా ఉత్తర్వులు జారీచేశారు.