రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • January 19, 2022 2:28 pm

ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యాలను మొత్తం మంజూరు చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు అందాల్సిన 10.01 శాతం కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ వెల్లడించారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఉపాధ్యాయ సంఘాలు, గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ… టీఎన్జీవో అధ్యక్షులు రాజేందర్, జనరల్ ప్రెసిడెంట్ ప్రతాప్ తదితరులు సీఎం కేసీఆర్ కు, మంత్రులు కేటీఆర్ కు, హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Connect with us

Videos

MORE