mt_logo

9-11ఎంపీ స్థానాలతో టీఆర్ఎస్ జయకేతనం- ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్

రేపు వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 9నుండి 11 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ కు దక్కనున్నాయని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగించనుందని బుధవారం ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి 3, టీడీపీ-బీజేపీ కూటమికి 2, ఎంఐఎం 1 స్థానాన్ని దక్కించుకోనున్నాయని సర్వే ఫలితాలు వెల్లడించాయి. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ, టీడీపీ-బీజేపీ కూటమి మధ్య పోటాపోటీ జరగనుందని, కేంద్రంలో ఎన్డీయే కూటమికి 279 ఎంపీ స్థానాలతో సంపూర్ణ మెజారిటీ వస్తుందని, యూపీఏకు 103 స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ సర్వే తెలిపింది.

బీజేపీకి ఒంటరిగానే 235 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ కు కేవలం 79 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కుతాయని, ఎన్డీయే, యూపీఏ ల్లో లేని పార్టీలు మొత్తం కలిసి 116 సీట్లు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ సమాచారం. తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు 30, 32 ఎంపీ స్థానాలతో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీలుగా ఉండబోతున్నాయని ఎన్డీటీవీ సర్వేలో తేలింది. బీహార్ లోని 40 ఎంపీ సీట్లలో 22 స్థానాలు, ఉత్తరప్రదేశ్ లోని 80 స్థానాల్లో 56 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *