అమెరికాలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సియాటెల్ నగరం లో ఘనంగా జరిగాయి. రాష్ట్రం కొసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి సమావేశం ప్రారంభించారు. సుధీర్ జలగం ప్రారంభోపన్యాసం చేస్తూ 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుండి టీ.ఆర్.ఎస్ పార్టీ ప్రస్థానం, ఏట్లొస్తదే తెలంగాణ అని బయపడే రోజు నుంచి తెలంగాణ ఎట్ల రాదో తెల్సుకుందాం అని ప్రజల్లో చైతన్యం తెచ్చిన టీ.ఆర్.ఎస్ వ్యుహాల గురించి సభకు చెప్పారు. అదే విదంగా సంఘాలెన్ని వచ్చిన సమాంతరంగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఎన్నో వ్యూహ ప్రతి వ్యుహాలతో మొక్కవోని దైర్యంతో టీ.ఆర్.ఎస్ శ్రేణులని నడిపించిన టీ.ఆర్.ఎస్ అధినేత కే.సీ.ఆర్ గారికి, టీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎన్.ఆర్.ఐ టీ.ఆర్.ఎస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న టీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికి చేయుత నందించి, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో విద్యావంతులుగా, మేధావులుగా ఎన్.ఆర్.ఐ టీ.ఆర్.ఎస్ తరపున పార్టి ముఖ్యులకు సూచనలు అందించే దిశలో ఇంకా ముందుకు రావాలని సూచించారు.
తెలంగాణ ప్రాంతం నుండి సియాటెల్ పర్యటనకు వచ్చిన మురళిధర్ రెడ్డి గారు, జలగం రంగారావు గార్లు తెలంగాణ ఉద్యమంలో తమ అనుభవాల్ని పంచుకొని ప్రవాస తెలంగాణ మిత్రులకు విలువైన సూచనలు చెయటంతో పాటు కొంతమంది తెలంగాణ మిత్రులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
స్థానికంగా ఉన్న తెలంగాణ వారందరినీ ఒక చోట చేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలను కాపడుతున్న స్థానిక తెలంగాణ సంఘాలను చప్పట్లతో సభ మొత్తం అభినందించింది. ఈ సమవేశంలో వంశి రెడ్డి, విక్రం గార్లపాటి, చంద్ర సుంకే, శ్రీధర్, దినేష్ జలగం, నవీన్ గడ్డం, నవీన్ గోలి, హరి, సాయి, మహేశ్, రాహుల్, అనురాధ ..ఇంకా అనేకమంది ప్రవాస తెలంగాణ మిత్రులు పాల్గొని తమ తమ అనుభవాలు, సూచనలు చేశారు.