mt_logo

మరి కాసేపట్లో వరంగల్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..

వరంగల్ నగరంలోని హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో మరికొద్ది సేపట్లో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగబోతోంది. నగరమంతా టీఆర్ఎస్ పార్టీ జెండాలతో గులాబీమయంగా మారింది. వేదికపై తెలంగాణ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకొని ప్రసంగించనున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *