mt_logo

హైదరాబాద్‌లో టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్

ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్‌.. తమ స్మార్ట్‌ ల్యాబ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టైటాన్‌లాంటి ప్రముఖ సంస్థ హైదరాబాద్‌లో స్మార్ట్‌ ల్యాబ్‌ను తీసుకురావడం శుభ పరిణామమన్నారు. కాగా, వాచీల తయారీ ఇక్కడే చేయాలని కోరామన్న జయేశ్‌ రంజన్‌.. టైటాన్‌కు అనుబంధంగా ఉన్న తనిష్క్‌ జ్యుయెల్లరీ రిఫైనరీనిగానీ, తయారీనిగానీ చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. టైటాన్‌ సంస్థ సీఈవో సుపర్ణ మిత్రా మాట్లాడుతూ.. ఇన్నోవేషన్‌, టెక్నాలజీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో తమ స్మార్ట్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం 85గా ఉన్న ఉద్యోగులను రాబోయే రోజుల్లో 400లకు పెంచే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టైటాన్‌ ఎండీ వెంకటరామన్‌, సీవోవో రవి కుప్పురాజ్‌, ప్రొడక్ట్‌ టెక్నాలజీ హెడ్‌ రాజ్‌ నెరావతి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *