mt_logo

ఆంధ్రలో పార్టీ పెట్టమని వేలకొద్ది విజ్ఞప్తులు వస్తున్నాయి : అధ్యక్షోపన్యాసంలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయని టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ తన అధ్య‌క్షోప‌న్యాసంలో పేర్కొన్నారు. “ద‌ళిత బంధు ప్ర‌క‌టించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాప‌న‌లు వ‌చ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామ‌ని చెబుతున్నారు. తెలంగాణ ప‌థ‌కాలు త‌మ‌కు కావాల‌ని ఆంధ్రా ప్ర‌జ‌లు కోరుతున్నారు. తెలంగాణ‌లో మంచి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయని, ఆ రాష్ట్రంలో మ‌మ్మ‌ల్ని కూడా క‌ల‌పాల‌ని కోరుతూ నాందేడ్, రాయ‌చూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వ‌చ్చాయి. ఉత్త‌రాది నుంచి వేల సంఖ్య‌లో కూలీలు వ‌చ్చి ప‌ని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్ర‌తిష్ఠ ఇనుమ‌డిస్తోంది” అని కేసీఆర్ అన్నారు.

“కేసుల‌తో అభివృద్ధిని అడ్డుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. పాల‌మూరులో పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేశామ‌న్నారు. సాహ‌సం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. క‌ల‌లు క‌ని.. ఆ క‌ల‌ల‌నే శ్వాసిస్తే సాకార‌మ‌వుతాయి. తెలంగాణ‌లో అద్భుతంగా వ్య‌వ‌సాయ స్థీరీక‌ర‌ణ జ‌రిగింది. మ‌నం విడిపోయినపుడు త‌ల‌సరి ఆదాయం రూ.1.70 ల‌క్ష‌లే., తెలంగాణ వచ్చాక మన త‌ల‌స‌రి ఆదాయం రూ.2.35 ల‌క్ష‌ల‌కు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే క‌రెంట్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కొందరు ఏపీ నేత‌లు అపోహ‌లు సృష్టించారు. కానీ తెలంగాణ‌లో 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మ‌వుతంద‌ని” సీఎం కేసీఆర్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *