ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ గెలువడంలో నాకు వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలని తెలిపింది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. ముఖ్యంగా తనకి అనుక్షణం మద్దతుగా నిలిచిన సాయ్, అజయ్ సర్, భాస్కర్ భట్, కోచ్‌లకు ధన్యవాదాలు అన్నారు. వీళ్లందరి సహకారం వల్లే తను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినట్లు పేర్కొన్న నిఖత్… వరల్డ్ బాక్సింగ్ టైటిల్‌తో ఒక కల నెరవేరినా.. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యం అని స్పష్టం చేసింది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడించారు.

