ఐటీ రంగంలో తెలంగాణ మరో అద్భుతాన్ని చేయబోతోంది. అత్యాధునిక సాంకేతిక విప్లవంగా కొనియాడబడుతున్న మెటావర్స్ టెక్నాలజీని వినియోగించి తెలంగాణ స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్-2022ను ఆవిష్కరించబోతున్నది. దేశంలో మెటావర్స్‌ను వాడుతున్న తొలి రాష్ట్రం తెలంగాణే. అంతేకాదు.. ఐటీ ప్రపంచంలో సరికొత్త సంచలనమైన నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) సొంతంగా రూపొందించింది. దీనిని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మెటావర్స్ వేదికగా సోమవారం ఆవిష్కరించనున్నారు. ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఎన్‌ఎఫ్‌టీలను విడుదల చేయనున్నారు. అత్యాధునిక బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎన్‌ఎఫ్‌టీలను రూపొందించడం టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్తదని ఐటీ నిపుణులు అంటున్నారు.
