తెలంగాణలో ఆంధ్రా పెత్తనం కోరుకునే నాయకులే టీడీపీలో ఉంటారని, తెలంగాణ టీడీపీలో కొందరు కల్తీ నాయకులు ఉన్నారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. అయితే టీడీపీలో కొందరు నిఖార్సైన తెలంగాణ వాదులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు వారసత్వంగా ఆస్తులు కాకుండా కరెంటు కోతలు ఇచ్చారని, హత్య చేసిన వ్యక్తే పరామర్శకు వెళ్ళినట్లుగా కాంగ్రెస్ పనితీరు ఉందని, రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ నేతలు రైతుయాత్ర చేపట్టాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.