తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు దేశానికి మార్గదర్శకుడు అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ పథకాలు దేశానికి వెలుగులు పంచుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ఆర్ధిక, వ్యవసాయ రంగాల నిపుణులు, మేధావులు, అంతర్జాతీయ పరిశీలకులు అందరూ మన పథకాలను ప్రశంసిస్తున్నారు. ఇవి దేశానికి, ప్రపంచానికి అవసరమని చెప్తున్నారు. ఈ పథకాలపై ప్రత్యేకంగా వీడియోను రూపొందించడం జరిగింది.

