శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటా ప్రకారం రావాల్సిన వనరులను అన్నింటినీ దక్కించుకోవాలని, అందుకు అవసరమైన దారిని వెతుక్కొని ఆ దిశగా పయనించాలని అన్నారు. అభివృద్ధికి అవసరమైన రెండవ దశను ప్రారంభించాలని, ఉద్యమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందున తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ గుర్తింపు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు విజన్ 2020 ఎందుకూ పనికి రాకుండా పోయిందని, అందుకే విజన్ విధానాన్ని పాటించాల్సిన పనిలేదని కోదండరాం అన్నారు. ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ లగడపాటి జగడపాటి అని రాజ్యసభలో బీజేపీ, టీడీపీ సభ్యులు గోడమీది పిల్లుల్లా ప్రవర్తించారని, వెంకయ్యనాయుడు తన ఆంధ్రా బుద్ధిని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో సీమాంధ్ర నాయకత్వంలో ఉన్న పార్టీలకు ఓటేస్తే మళ్ళీ తెలంగాణ నీటివనరులను దోచుకుపోయే ప్రమాదం ఉందని, చంద్రబాబు, వైఎస్ సీఎం కావాలనే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుని లాభపడ్డారని, అటువంటి సీమాంధ్ర పార్టీల్లో తెలంగాణ ప్రాంత నేతలు పనిచేయడం దారుణమని స్పష్టం చేశారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్