కేరళ కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీ తో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్ ఎండీ జాన్ నేచు పాదం ఒప్పంద పాత్రలు ఇచ్చి పుచ్చుకున్నారు.
రాష్ట్రంలో రైతులు పండించే మిర్చి పంటలను పేదరిక నిర్మూలన సంస్థ – మహిళా సమాఖ్యల అధ్వర్యంలో నడుస్తున్న 56 రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా విక్రయాలు జరుపుతారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలు చోట్ల ఈ సంస్థ ద్వారా 60 కోట్ల మేర మిర్చి వ్యాపారం జరుగుతుంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫ్లిప్ కార్డ్ లాంటి సంస్థలతో జరిగిన ఒప్పందాలు బాగున్నాయని వివరించారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.