mt_logo

దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది తెలంగాణనే : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లోని కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును ఉద్దేశించి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జూమ్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ, వ్యవసాయ రంగం వృద్ధి చెందిందని, టీఎస్ఐఐసీతో పారిశ్రామిక రంగంలో నవశకం మొదలైందని మంత్రి తెలిపారు. కోవిడ్ వైరస్‌కు వ్యాక్సిన్‌ను తెలంగాణ నుంచే దేశానికి అందించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌కు కేటాయిస్తున్నాం. ఎనిమిదేండ్లలో తెలంగాణలో 240 కోట్ల మొక్కలు నాటామని మంత్రి స్పష్టం చేశారు. వీటిలో 85 శాతం మొక్కలు బతికాయన్నారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణకు చెందిన గ్రామాలు ఉండడమే దీనికి నిదర్శనం అన్నారు. అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షన్‌లో సైతం రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులిచ్చిందని వెల్లడించారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *