mt_logo

తెలంగాణ ఆవిర్భావ తేదీ దగ్గరలోనే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో చివరి అంకమైన రాష్ట్రపతి సంతకంతో వెలువడే గెజిట్ ప్రకటన అతిత్వరలో అంటే ఒకటి లేదా రెండు రోజుల్లో రానుంది. దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర అప్పాయింటెడ్ తేదీ గెజిట్ లో పొందుపరచబడుతుంది. తెలంగాణ బిల్లు న్యాయశాఖ ఆమోదం పొంది కేంద్ర హోం శాఖకు తిరిగి వచ్చిందని, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారని సమాచారం. కేంద్రప్రభుత్వం సాధ్యమైనంత వరకు అతి దగ్గరలో అప్పాయింటెడ్ డే ఉండేట్లు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే. మహంతి డిల్లీలో ఉండి కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చలు జరుపుతూ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి విభజనకు అవసరమైన రికార్డులను వెంటనే తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల అంశం, ప్రాంతాలవారీగా విభజన, నదీజలాల కేటాయింపు, బోర్డుల ఏర్పాటు, ప్రభుత్వ ఆదాయం, ఆస్తులు, అప్పులు, హైదరాబాద్ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని కానున్నందున రెండు రాష్ట్రాలకు వేర్వేరు భవనాల ఏర్పాటు తదితర విషయాల పట్ల వారం రోజుల్లో పూర్తి చేయాలని మహంతిని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *