రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చెయ్యట్లేదు. రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కేంద్ర కేబినెట్ అజెండాలో టేబుల్ ఐటంగా రాష్ట్రపతి పాలన అంశాన్ని చేరుస్తారు. కేంద్ర హోం శాఖ ఈ విషయమై ఒక నోట్ ను కూడా సిద్ధం చేసింది. ఇప్పుడున్న తాజా రాజకీయ పరిణామాల మధ్య ఏ ప్రాంతం వ్యక్తిని సీఎం గా ఎన్నుకోవాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. సామాజిక వర్గం విషయంలోనూ అదే సందిగ్ధత నెలకొనడంతో ఇన్నిరోజులూ ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరికి రాష్ట్రపతి పాలనకే అనుకూలంగా ఉన్నట్లుగా తెలిసింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో విభజన ప్రక్రియ ఎలక్షన్లకు ఏమాత్రం అడ్డు కాదని, అవసరమైతే ఎన్నికలు జరిగాక రెండు అసెంబ్లీలను ఏర్పాటు చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ వివరించింది. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పడంతో మూడు నెలల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల లాభం ఏమీ లేదని భావించి కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపుతున్నట్లు కీలక సమాచారం అందింది.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్