mt_logo

కెనడాలో అత్యంత వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆధ్వర్యంలో మే 28, 2016న మిస్సిస్ సౌగలో నిగ్లెన్ ఫారెస్టు సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ
ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో 700కు పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతంచేసారు.

మొదటగా కార్యదర్శి అతీక్ పాషా అందరికి ఆహ్వానం పలికారు అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు సభ ప్రారంభానికి జెండా ఊపగా,  శ్రీమతి ప్రియఈద, శ్రీమతి సుధ కంభాలపల్లి, శ్రీమతి మల్లెశ్వరి గజవాడ, శ్రీమతి మంగా వాసం మరియు శ్రీమతి మీరాగంట గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.

శ్రీ చంద్ర స్వర్గం గారు మరియు శ్రీ వేణు రోకండ్ల గారు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకు విచ్చేసినవారందరితో మౌనం పాటింపచేసిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాథితిగా కెనడాలోని ఒంటారియో ప్రభుత్వ ఆరోగ్యశాఖామాత్యులు శ్రీమతి దీపిక దామెర్ల గారు, కెనడాలో భారత ప్రభుత్వ ఉప రాయబారి శ్రీమతి ఉషా గారు మరియు పనొరమ ఇండియా టొరొంటో చైర్మన్ శ్రీమతి అను శ్రీవాత్సవ గారు విచ్చెసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడాలోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఓంటారియో ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీమతి కాత్లిన్వి ప్రత్యేకంగా పంపించిన మెసేజ్‌ను ఆరోగ్య శాఖామాత్యులు శ్రీమతి దీపిక దామెర్ల గారు చదివి సభికులకు వినిపించారు. ఈ సందర్బంగా తెలంగాణ కెనడా సంఘం ఉచిత టాక్స్‌ఫైలింగ్ సేవలకు గాను కెనడా ప్రభుత్వం వారు అవార్డు చేసిన సర్టిఫికెట్‌ను అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారికి మరియు శ్రీ హరిరావులు గారికి భారత ప్రభుత్వ ఉప రాయబారి శ్రీమతి ఉషా గారు అందించారు.

ఈ వేడుకలు కల్చరల్ సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల గారి ఆధ్వర్యంలో ఎన్నో వివిద సాంస్కృతిక కార్యక్రమాలతో దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి.

మల్లన్న వేషంలో విజయకుమార్ తిరుమలాపురం రాములమ్మ వేషంలో కుమారి తులసి మదపు తెలంగాణ యాస మరియు బాషలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు, పోతరాజు వేషంలో శ్రీ  గిరిధర్ కరీవిడి గార్లు అద్భుతమైన లష్కర్ బోనాల ఊరేగింపు సభికులందర్ని విషేషంగా ఆకర్శించాయి.

ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భానిలో ప్రదర్శించటం విశేషం.

సభికులందరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారి ఆధ్వర్యంలోజరుగగా, ట్రస్టీ అధ్యక్షులు శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు శ్రీ కుందూరి శ్రీనాధ్, సెక్రటరీ సయ్యద్ అతీక్ పాషా, కల్చరల్ సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల, ట్రెజరర్ శ్రీ దేవేందర్ గుజ్జుల, జాయింట్ ట్రెజరర్ శ్రీ శంతన్ నేరెల్లపల్లి, డైరక్టర్లు శ్రీ వేణు గుడిపాటి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ సమ్మయ్యవాసం, శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, శ్రీమతి రాధిక బెజ్జంకి, ట్రుస్టీలు శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి, శ్రీ హరిరావుల, శ్రీ రాజేశ్వర్ ఈద, శ్రీమతి శిరీషస్వర్గం, ఫౌండర్లు శ్రీ ప్రకాశ్ చిట్యాల, శ్రీ నవీన్ సూదిరెడ్ది, కలీముద్దీన్, శ్రీ నివాస్ తిరునగరి, ముఖ్య వాలంటిర్లు శ్రీ మల్లికార్జున్ మదపు, శ్రీ నర్సింహ మూర్తికలగోని మరియు ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహించగా ఫౌండర్ శ్రీ రమేశ్ మునుకుంట్ల సమన్వయపరిచారు. ఆఖరున, శ్రీ చంద్రస్వర్గం గారు వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *