తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా) ఆధ్వర్యంలో జూన్ 11న సియాటెల్ పట్టణంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సంస్థ తరపున రాష్ట్రమంత్రి శ్రీ కె. తారక రామారావు గారిని, ఎం.పి శ్రీ వినొద్ కుమార్ గారిని ముఖ్య అథిదులుగా హాజరు కావాలని అహ్వానం పంపారు. గత కొంత కాలంగా ఎన్నొ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న వాటా (WATA) ఈ మద్యనే సిని సంగీత కళాకారుడు తమన్ తో ఒక ఫండ్ రైసింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలు లేని పేదింటి పెద్ద మనషుల కోసం ఒక ఓల్డ్ యేజ్ హోం కట్టడానికి ముందుకు వచ్చింది. అదే విదంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ, బోనాలు లాంటి అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సంస్కృతిని కాపాడటంలో స్థానిక తెలంగాణ సంఘాలతో (WATG, NRI TRS etc) కలిసి పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వాదులందరికీ, మరియు ఇతర ప్రాంతాల వారికి కూడ నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.