mt_logo

మస్కట్, బహరేన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు

బహరేన్: బహరేన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరులకు క్రోవ్వత్తులు వెలిగించి వారికి నివాళ్ళు అర్పించి వారి వీర త్యాగాలను స్మరించుకున్నారు. మనామా సెంట్రల్ బస్టాండ్ లో ప్రయాణికులకు పండ్లు మరియు వాటర్ బాటిళ్ళు పంపిణీ చేసారు. వాటర్ గార్డెన్లో కేకును కట్ చేసి ఆనందోత్సాహాలతో అవతరణ వేడుకలు జరుపుకున్నారు.

ఎన్నారై  టీఆర్ఎస్ సెల్ గల్ఫ్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంచార్జ్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ బహరేన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రెండవ సారి కూడా ఇక్కడే జరుపుకుంటున్నందుకు సంతోషంగా వుంది. అమరవీరుల త్యాగఫలంతో, కేసీఆర్ గారి సారథ్యంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, భగిరథలు, ఇలా అనేక రంగాలలో విజయపథంలో దూసుకెల్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడానికి మా వంతు బాధ్యతతో కృషి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎనలేనిదని ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ గల్ఫ్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంచార్జ్ బోలిశెట్టి వెంకటేష్, నాయకులూ ప్రశాంత్, బద్రి, రాజేశ్వర్ గౌడ్, సుమన్, డా.రవి, గంగన్న, రవి దేవిశెట్టి, రాజు, గంగాధర్, నర్సయ్య, తిరుపతి, శ్రీనివాస్, ప్రకాష్, శంకర్, రాజేష్, సుధాకర్, వినోద్, సదానంద్, బుచ్చి రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మస్కట్:

మస్కట్ లో ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రెండవ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ కో-ఆర్డినేటర్ అడువాల శంకర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త కొత్త పథకాలతో ముందుకు వెళుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు కేసీఆర్ గారి బంగారు తెలంగాణ సాధనకై అందరు తమవంతు కృషి చేయాలనీ ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మస్కట్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ కో-ఆర్డినేటర్ అడువాల శంకర్,  ఎన్నారై టీఆర్ఎస్ నాయకలు శ్రీనివాస్, లక్ష్మణ్, కబీర్, మహిపాల్, మన్సూర్, తిరుపతి, అల్లమోద్దిన్, సయ్యద్, సత్తయ్య, చంద్రయ్య, రాజయ్యలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *