Mission Telangana

మలేషియాలో ధూం ధాంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

మలేషియా కోలాలంపూర్ రాష్ట్రంలోని బ్రిక్ ఫీల్డ్స్ లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) అద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ధూం ధాంగా జరిగాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ సంబరాల్లో మహిళలు, చిన్నారులతో పాటు భారీ సంఖ్యలో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. సంబరాల్లో భాగంగా మైట సభ్యులు కేక్ కట్‌చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి లోటస్ ఈ రేమిట్ వారు స్పొన్సెర్ చేసారు.

ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదమ్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోప్పరిస్ సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు స్టాలిన్, హజారి శ్రీధర్, కృష్ణవర్మ, బురెడ్డి మోహన్ రెడ్డి, అమర్నాధ్, చిట్టి, రవీందర్ రెడ్డి, రఘు, శాంతి, రవి చంద్ర, అజయ్, కార్తీక్, రవివర్మ, ఏబినిజేర్, లక్ష్మి కాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైట ఈ సంవతరానికి గాను క్రింది నూతన కార్యవర్గ సభ్యులును అధికారికంగా ప్రకటించింది

ప్రెసిడెంట్: సైదమ్ తిరుపతి,
వైస్ ప్రెసిడెంట్: సోపరిస్ సత్య,
సెక్రెటరి: రవి వర్మ
జాయింట్ సెక్రటరీ: చిట్టి
కోశాధికారి: రఘుపాల్
ముఖ్య కార్యవర్గ సభ్యులు: రవీందర్ రెడ్డి, బురెడ్డి మోహన్ రెడ్డి, రవిచంద్ర, కృష్ణ వర్మ
యూత్ ప్రెసిడెంట్: స్టాలిన్
యూత్ వైస్ ప్రెసిడెంట్: చందు
ఈవెంట్: ప్రభాకర్,శ్రీకాంత్,రమణ,శివ, కృష్ణ వర్మ, రవి, అజయ్ రావు, శ్రీనివాస్, రంజిత్, వేణు గోపాల్, శశిధర్, కిరణ్ గౌడ్, అజయ్ కుమార్
ఉమెన్స్ ప్రెసిడెంట్: కిరణమై
అడ్వైసరి కమిటి చైర్మెన్: ఎబ్బినిజేర్
అడ్వైసరి కమిటి: అమరనాథ్, అశోక్, సురేష్, శాంతి ప్రియ, శ్రీధర్ హజారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *