mt_logo

ఈనెల 22నుండి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు..

ఈనెల 22వ తేదీనుండి జరగనున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలపై శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాంబర్ లో జరిగిన ఈ సమావేశానికి శాసనమండలి చైర్మన్ కే. స్వామి గౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహాచార్యులు, STF DG తేజ్ దీప్ కౌర్, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు ఈనెల 22 నుండి 25 వరకు జరుగుతాయి. మొత్తం 3 రోజులు శాసనసభ సమావేశం ఉంటుంది. అందరి సహకారంతో శాసనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నది. సహకరించిన అందరికీ అభినందనలు. గతంలో మాదిరిగా అందరి సహకారం కొనసాగాలి. శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరగడంలో పోలీస్ శాఖది కీలక బాధ్యత. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు.

శాసనమండలి చైర్మన్ కే. స్వామిగౌడ్ మాట్లాడుతూ సమావేశాలకు ముందు పోలీస్ అధికారులతో సమావేశం జరపడం ఆనవాయితీ. సమావేశాలు శాంతియుతంగా జరపడానికి అందరి సహకారం అవసరమని అన్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుండి అందిస్తామని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *