mt_logo

తెలంగాణ వ్యవసాయ సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి : ‘దక్షిణ భారత రైతు సమితి’ డిమాండ్

శనివారం చెన్నైలో సమావేశమైన దక్షిణ భారత రైతు సమితి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయ రంగంకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా తమిళనాడులో కూడా అమలుపరచాలని వినతి పత్రాన్ని సీఎం స్టాలిన్ కు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పథకాలు అద్బుతంగా ఉన్నాయని, వాటిని తమిళనాడులో అమలు చేసేందుకు పరిశీలిస్తాం అని హామీ సీఎం స్టాలిన్ ఇచ్చారు. జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షుడు, పసుపు బోర్డ్ సాధన సమితి అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అబలంబిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు బంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. వానాకాలంలో 7000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వరిధాన్యంన కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదని, ఎమ్మెస్పీ విషయంలో కేంద్రానికి లేఖ రాసి మరోమారు రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఉన్న చిత్తశుద్ధి చాటుకున్నారని అభినందించారు. అన్ని రాష్ట్రాలు ఎమ్మెస్పీ పై కేంద్ర ప్రభుత్వం ను నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కేరళకు చెందిన రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ కో ఆర్డినేటర్ పిటి జాన్ మాట్లాడుతూ… రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగమని, తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ అని హర్షం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు శాంతా కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు పథకాలు అద్బుతమని అన్నారు. రైతులకు మేలు చేసేలా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని… రైతుల, వ్యవసాయ రంగంపై వివక్ష పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం అభినందనీయమన్నారు. ఎమ్మెస్పీ, ఇతర రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *